ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
మరో ఆరుగురికి మంత్రిగా ఛాన్స్
ప్రజాదారణ పొందిన నేతగా మంత్రి పొన్నం కు మరో బాధ్యత
హైదరాబాద్ ; ఆనాటి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం గతంలో చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశరు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్న మంత్రి .
మొన్న జరిగిన అసెంబ్లీలో ఉద్యమ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ నేతలకు మాటకు మాట ఇస్తూ గర్జించారు డిప్యూటీ సీఎం గా పొన్నం ప్రభాకర్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది రాష్ట్రంలోనే ప్రజాదారణ పొందిన ముఖ్య నేతగా పెప్పర్ స్ప్రే తో కూడా ఉద్యమాన్ని ఆపని నేతగా పార్టీలో అన్ని రంగాలలో ఉంటూ ఇన్నేళ్లు కష్టపడ్డా పొన్నం ప్రభాకర్ కే పదవి ఇవ్వాలని కరీంనగర్ జిల్లా నేతలు కోరుకుంటున్నారు .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మరికొన్ని మంత్రి పదవులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే మరో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.