వివిధ రోగాలను నయం చేసే పసుపు అత్యంత అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
బహుశా భారతదేశంలో పసుపు లేని ఇల్లు లేదు, అన్ని ఇండ్లల్లో పసుపు ఉంటుంది. పసుపు ఆరోగ్యప్రదమైనది, ఆరోగ్య సంరక్షణకు, సంవర్ధనకి ఉపయోగిస్తుంది. రుచికి శుభ్రతకి మంగళకరమైన భావానికి ప్రతీక అందువలన మంగళ కార్యక్రమాలలో దీన్ని వాడుతారు. ప్రతి శుభకార్యాలలో తప్పకుండా పసుపుని వాడటం భారతీయుల సంప్రదాయం. వివాహ సంస్కారాలు మరియు, ఏదైనా శుభకార్యాలు ప్రారంభించాలంటే అది పసుపు తోనే ప్రారంభం చేస్తారు. ఆకుకూరలు పప్పుకూరలు మొదలైన ఆహార పదార్థాల్లో పరిరక్షణ కోసం దీన్ని వాడటం జరుగుతుంది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఇది ఒక అద్వితీయ ఔషధంగా భావించబడుతుంది.
ప్రయోజనాలు
పసుపులో పరమశక్తివంతమైన ఫినోలిక్ కాంపౌండ్ కర్క్యూమిన్ ఉంటుంది. ఇది జలుబు దగ్గు నొప్పి బాధ బాపు వంటి సాధారణమైన సమస్యలే గాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాన్ని కూడా నివారించగలదు. కర్క్యూమిన్ని, డైపెరూలైలా మిథెన్ అని కూడా అంటారు. డిమోధోక్సి, కర్క్యూమిన్, బిసడి మేధాక్సీ కర్క్యుమిన్ అనే రెండు ప్రధాన రసాయనాలు ఉంటాయి కర్క్యూమినాయడ్ కుటుంబానికి చెందిన ఈ రెండు పదార్థాలు ప్రకృతి సహజంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు సంధి వాతం నొప్పులు తగ్గిస్తాయి.
ఆయుర్వేద వైద్యులు అధ్యయనం చేసి పసుపులో గల అనేక రకమైన మంచి గుణాలు కనిపెట్టారు. కీళ్ల నొప్పులు, మంట, వాపు సమస్య నివారిస్తుంది మెదడును, మూత్రపిండాలు ఉపరితిత్తులు గుండె వాపుని కూడా నివారిస్తాయి చివరకు ప్రేవుల్ని ఎండో టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది. భారతీయులు ప్రత్యేకంగా పసుపుని వంటల్లో వాడటం వల్ల ధారాలాంటి ఫైబర్ ఫిల్మెంట్లో ( సెల్స్ నిర్మించేవి ) జ్ఞాపకశక్తి నారసం చేసే బీటా ఏమిలాయిడ్ ప్రోటీన్ ని ప్రారంభ ధర నుంచే తయారు కాకుండా చూస్తుంది. డిమోన్షియ, అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది.
దుష్ప్రభావాలు
అంతేకాకుండా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. పసుపుతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తే చర్మం,చెమట పసుపు రంగులో ఉంటాయి. ప్రతిరోజు ఒకటిన్నర, రెండు గ్రాములు పసుపు తీసుకుంటే గుండెకు మంచిది కానీ ఎక్కువగా తీసుకోవటం కొంతమందికి వాంతులు, విరోచనాలు, కడుపులోని బాధ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవైనా దీర్ఘకారక మందులు వాడినప్పుడు పసుపు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.