Home రాశి ఫలాలు వార‌ఫ‌లాలు (జూలై 11-17)

వార‌ఫ‌లాలు (జూలై 11-17)

by live
0 comment

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,

వృషభరాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశం మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. శుభం కలుగుతుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4