Home ప్రత్యేకం ఇంటర్వ్యూలకు ఈ టెక్నిక్స్ చాలు

ఇంటర్వ్యూలకు ఈ టెక్నిక్స్ చాలు

కాన్ఫిడెంట్​ గా కనిపించడం ఎంతో ముఖ్యం

0 comment

 

మీకు ఎన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్​ ఉన్నా ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్​ గా కనిపించడం ఎంతో ముఖ్యం. అదెలాగో తెలుసుకుందాం..

డ్రెస్​ కోడ్​
ఇంటర్వ్యూలకు సరైన డ్రెస్​ వేసుకొని వెళ్లాలి. మీరు వెళ్లిన కంపెనీలో ఎంప్లాయీస్​ కు డ్రెస్ కోడ్​ ఏమైనా ఉందా అని ముందే తెలుసుకోవాలి. ఇందుకోసం కంపెనీ వెబ్ సైట్ లో ఉద్యోగుల ఫొటోలు ఉంటే చూడాలి. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోయినా ఫార్మల్ డ్రెస్ లో వెళ్లడం ఉత్తమం.

అలర్ట్ గా ఉండండి
మీరు కూర్చొనే పద్ధతి మీరు అలర్ట్ గా ఉన్నారో లేదో చెప్పేస్తుంది. కుర్చీలో నిటారుగా కూర్చొని చేతులను తొడలపై ఫ్రీ గా వదిలేసి ఉంచండి. ఇది మీ ఫ్రెండ్లీ నేచర్ ను, ఓపెన్ మైండ్ ను సూచిస్తుంది.

బ్రీతింగ్ టెక్నిక్స్
ఇంటర్వ్యూలో టెన్షన్ పడితే మెదడుకు బదులుగా కండరాలకు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఇది మీ జ్ఞాపకశక్తి భాషపై ప్రభావం చూపిస్తుంది. అందుకే బ్రీతింగ్ టెక్నిక్స్ తో నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా టెన్షన్​ ను దూరం చేసుకోవచ్చు.

ముందే ప్రిపేర్ అవండి
ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఊహించి వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో ముందే ప్రేపేర్​ అవండి. అద్దం ముందు నిలబడో లేక మీ కుటుంబ సభ్యుల ముందో మాక్​ ఇంటర్వ్యూ ప్రాక్టీస్​ చేయండి.

ఐ కాంటాక్ట్ ముఖ్యం
మీరు కాన్ఫిడెంట్ గా కనిపించేందుకు ఇంటర్వ్యూ చేసే వారితో సరైన ఐ కాంటాక్ట్ కలిగి ఉండటం ముఖ్యం. ఇది మీ అటెన్షన్ ను తెలియజేస్తుంది.

బాడీ మూవ్​ మెంట్స్
చేతులు నలుపుకోవడం, మిటిటెలు వేయడం, కాళ్లు ఊపడం, కుర్చీలో అటుఇటూ కదలడం మీ ఆందోళనను, అసమర్థతను ఎదుటి వారికి సూచిస్తాయి. కాబట్టి ఇలాంటివి చేయకండి.

ఆలోచించి బదులివ్వండి
ఒక్కో ప్రశ్నకు నిదానంగా ఆలోచించి సమాధానాలు ఇవ్వండి. ఏదైనా ప్రశ్న గురించి స్పష్టత కావాలంటే భయపడకుండా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని అడగండి.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4