రామగుండం పోలీసు కమిషనరేట్ (NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలిన రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టొద్దని, స్వీయ రక్షణ కు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవటం మంచిదని తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి, డయాల్ 100 కి సమాచారం అందించాలన్నారు. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలని సూచించారు..
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందన్నారు.