22
తాడేపల్లి పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజి ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు వెలుగుచూశాయి. సుమారు 50 ప్రతిమలు ఒడ్డున కుప్పగా పోశారు. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి. ఎవరు వాటిని తెచ్చిపెట్టారో తెలియలేదు. అయితే.. ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే వాటిని నదిలే కలిపే ఆచారం ఉండటంతో.. ఈ విగ్రహాలను ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని గుర్తుచేశారు. పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కూడా కొందరు నాగదేవత ప్రతిమలను వదిలి వెళ్లారని.. దానికి కూడా ఇదే కారణం అయి ఉంటుందని తెలిపారు.