దర్శకుడి ఘనీభవించిన ఆలోచన వ్యధిత వ్యాకులత హృదయంతో అంటుంది,నా మస్తిష్కపు పాతాళంలో ఎగిసే లావాలు ,నీవు వెండితెరపై ఆవిష్కరించే రససృష్టికి సమిదలు కావాలని… ఇటాలియన్ దర్శకుడు Fedrico Fellini 1993 లో ఆస్కార్ అవార్డ్స్ కమిటీ ద్వారా జీవన సాఫల్య పురస్కారం పొందిన దర్శకుడు.తన సినిమాల ద్వారా ప్రపంచ సినిమాను ప్రభావితం చేసిన అతి కొద్దిమంది దర్శకులలో ఒకరు.ఫిల్మ్ మేకింగ్ పై వచ్చిన అతి అరుదైన సినిమాలలో ఇదొకటి.ఈ కథంతా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగుతుంది.ఇక కథలోకి వస్తే ఓ దర్శకుడు, తను తీసిన బ్లాక్ బస్టర్ సినిమా సక్సెస్ తాలూకు అనుభూతిని ఆస్వాదించి, ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా తీసే ప్రయాసలో Director block కి లోనవుతాడు, అందుకు తనను తాను రీఛార్జి చేసుకోవడం కోసం ఓ రిసార్ట్ లో చేరి తన కథకి వెండితెర రూపం ఇచ్ఛే ప్రయత్నంలో, తను పొందిన భావోద్వేగాలకు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడమే స్థూలంగా కథ. తను అనుకున్న కథకు వెండితెరపై ఆవిష్కరించే ప్రయాణంలో ,ఈ tinder box సమాజం, అతని సహచరి ఏవిదంగా స్పందించిందో అన్న ఉపమానం మనను ఆలోచింప చేస్తుంది.సినిమా అంటే ప్రాణం కల దర్శకులు, అసూయ, ద్వేషాలనే తప్ప ప్రేమను చూడలేరన్న అక్షర సత్యాన్ని Fellini వెండితెర పై అవిష్కరించిన తీరు ప్రపంచ సినిమా చరిత్రలో మఖుటాయమానం.ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకనిపించింది ,దర్శకుడు తనను తాను కాల్చుకొంటూ కోవత్తయి, వెలుగును ప్రసాదిస్తూ,తను వదిలిన మైనాన్ని ప్రేక్షకులు సేకరించి ,ఆ మైనంలో మరొదీపాన్ని వెలిగించి, ఆనందపడుతుంటారు,ఇదో obstract థింకింగ్..Fellini ఆత్మకథ అంటే నాకిష్టం,ఈ సినిమా కథా, కథనాలు నన్ను ఆలోచింప చేస్తాయి,ఎందుకంటే?దర్శకుడి బ్రతుకు పోరాటాన్ని సవివరంగా ఆవిష్కరించిన చిత్రమిది.చివరిగా Fedrico Fellini అంటాడు “Talking about dreams is like talking about movies, since the cinema uses the language of dreams; years can pass in a second, and you can hop from one place to another. It’s a language made of image. And in the real cinema, every object and every light means something, as in a dream”. By.Prakash Surya
8 1/2 (Eight and Half) ఓ దర్శకుడి ఆత్మకథ By.Prakash Surya
49
previous post