భారతీయ సినిమా, ప్రపంచ సినిమాకి పోటీ అని చాటిచెప్పిన చిత్రం “అర్ధసత్య”.సినిమా ద్వారా, ఎంటర్టైన్మెంట్ నే కాకుండా వాస్తవ పరిస్థితుల్ని పాత్రల ద్వారా చెప్పే ప్రయత్నం చేయాలి.గోవింద్ నిహలాని సృష్టించిన అనంత్ వేలంకర్(ఓంపురి) పాత్ర, ప్రేక్షకుల sub-conscious మైండ్ లో ముద్ర వేయడమే కాకుండా, మనమంతా చక్రవ్యూహంలో బంధించబడ్డామన్న అర్ధసత్యం మనకు గోచరిస్తుంది.”అర్ధసత్య” భారతీయ సమాజం లోంచి,సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్, వారి జీవితల్లోంచి వచ్చిన కథ.ఒక్క లైన్ లో కథ చెప్పాలంటే “దేనికి తల ఒగ్గని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని ఈ వ్యవస్థ చక్రవ్యూహంలో బంధిస్తే అనేక కుటిల సవాళ్ళని ఎదురీది, ఏవిదంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడన్నది కథ.” బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ Angry Young Men గా ఏలుతున్న రోజుల్లో ,గోవింద్ నిహ్లాని, ఓంపురిని, అనంత్ వేలంకర్ గా తీర్చిదిద్ది బాక్సఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టి, సమాంతర సినిమా commercial సినిమా కి తీసిపోదని నిరూపించిన దర్శక దార్శనికుడు. ప్రఖ్యాత మరాఠీ రంగస్థల రచయిత విజయ్ టెండూల్కర్ అందించిన స్క్రీన్ప్లే, SD Panvalkar రాసిన “సూర్య” కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది.భారతీయ సినిమా చరిత్ర లో COP సినిమాలకి ఓ కేస్ స్టడీ అని చెప్పవచ్చుఁ.వసంత్ దేవ్ dialouges ప్రాణం పోశాయి.సినిమా స్క్రీన్ప్లే కి అనేక అంశాలు దోహధపడుతాయి, Space, Time, Situation ,పాత్రలు,వాటి స్వభావాలు, వాటి ధర్మాలు.ఒక సమస్యకు చక్కని పరిష్కారం కథ,కథ ఓ సమస్య ,ఈ సమస్య పరిష్కారాలను తగు రీతిలో సృజనాత్మకంగా పరిష్కరించి ప్రేక్షకుడి హృదయాన్ని కనెక్ట్ చేయడమే దర్శకుడి దార్శనికత.దర్శక ధర్మాన్ని తన ఊహలతో ప్రేక్షకుల హృదయలను అనుసంధానించి వెండితెర సాక్షి గా అర్థవంతంగా చెప్పిన దర్శక ధీశాలి గోవింద్ నిహ్లాని.”అర్ధసత్య” ప్రపంచ ప్రేక్షకుల దృక్పథాన్ని మార్చేసింది.పోలీస్ కథలను అంతకు ముందు చూడని కోణాలను చూయించింది, సినిమాను ప్రేక్షకులు కొత్తగా చూడడం మొదలెట్టారు..మనిషి నిరంతరంగా ఏదో విధంగా చక్రవ్యూహంలో బంధింపబడుతాడు.దర్శకుని అంతరంగం బయట పడకుండా, మార్కెట్ శక్తులతో కుమ్ముక్కయినంత కాలం ప్రేక్షకుల అంతరంగాన్ని ఆయా దర్శకులు సృజించలేరు గొప్ప దర్శకులు ఎప్పుడూ, చేతనాన్ని ఉపసంహరించబడి, అచేతనం అభివ్యక్తం చేస్తూ,ఆత్మాభివ్యక్తీకరణ చేస్తారు. By.Prakash Surya
“అర్ధసత్య” By.Prakash Surya
48