1981లో విడుదలై , ఇంగ్లీష్ లో నిర్మితమైన ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ప్రఖ్యాత బెంగాలీ నటి అపర్ణా సేన్, నిర్మించిన వారు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు శశికపూర్.ఈ సినిమాలో ప్రధాన భూమిక పోషించిన జెన్నిఫర్ కేండెల్, శశికపూర్ స్వయానా భార్య కావడం విశేషం, ఆయన సోదరుడిగా,ఆమె తండ్రి Jennifer Kendel నటించడం మరో విశేషం.Transformation of impression into an expression is a cinema అన్న నానుడిని మహిళా దర్శకురాలు అపర్ణసేన్ నిర్వచించడం భారతీయ సినిమాకి గర్వకారణం.ప్రఖ్యాత సినిమా విమర్శకుడు చితానంద్ దాస్ గుప్తా కి అపర్ణసేన్ కూతురు.అప్పటికే ఎనలేని పేరు ప్రఖ్యాతలున్న అపర్ణసేన్ “36 చౌరంగీ లైన్” తో ఓ మహిలను protagonist గా తీర్చి దిద్ది ,కథా, కథనాలతో మహిళా దర్శకుల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పారని చెప్పవచ్చుఁ.3 dimensions of characters, వాటి limitations, ముఖ్యన్గా ఆంగ్లో -ఇండియన్ కుటుంబ వ్యవస్థను చిత్రించిన తీరు ప్రశంసనీయం.ఒక్కమాటలో చెప్పాలంటే తెల్ల వారు వదిలిన ఆంగ్లో-ఇండియన్ సంతతి బ్రతుకు పోరాటాన్ని చెప్పిన సినిమా అని చెప్పవచ్చుఁ.ప్రపంచంలో రెండు దేశాలు విడిపోయినప్పుడు, రెండు సంస్కృతులు దూరమైనప్పుడు కొన్ని సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతాయి,ఆ సందిగ్ధ పరిస్థితుల్లో అటు బ్రిటిష్ వారిగా కాకుండా, ఇటు పూర్తిగా భారతీయులుగా కాకుండా, మధ్యస్థ స్థితిలో ఉండే ఓ ఆంగ్లో-ఇండియన్ మహిళ పరిస్థితిని 36 చౌరంగీ లైన్ కళ్ళకు కట్టినట్టుగా చూయించి విజయం సాధించిన సినిమా,నాల్గు పాత్రలను పరకాయ ప్రవేశం చేయించిన సినిమా.ఒక్కొక్క కళకు ఒక్కొక్క విధమైన భౌతిక మాధ్యమం అవసరం.సాహిత్య సృష్టికి పదాలు, సంగీత సృష్టికి నాదం, నృత్యానికి గతి, ఇవి ఉంటేనే కళాకృతి, లేనిచో మానవ సృష్టిగా మిగిలి పోతాయి.రెండు ఆయతనాల,సమతల ప్రదేశం, మీద మూడు ఆయతనాల (three dimensions) మనిషి జీవితపు లోతులను ,ఎత్తులను సృష్టించడం ఈ సినిమా పరిణతి. By.Prakash Surya
“36 ChowRinGhee Lane” By.Prakash Surya
42
previous post