Home హైదరాబాద్ 220 కేవీ మియాపూర్ EHT సబ్ స్టేషన్ లో అనుమానాస్పద ఘటన..

220 కేవీ మియాపూర్ EHT సబ్ స్టేషన్ లో అనుమానాస్పద ఘటన..

పోలీస్ ఎంక్వైరీ కి ఆదేశించిన దక్షిణ డిస్కాం సిఎండి  ముషారఫ్ ఫరుకి

0 comment

220 కేవీ మియాపూర్ EHT సబ్ స్టేషన్ లో అనుమానాస్పద ఘటన..

హైదరాబాద్ :

12న ఉదయం 220 కేవీ EHT సబ్ స్టేషన్ మియాపూర్ లో, రాయదుర్గ్ – మియాపూర్ 220 కేవీ కేబుల్ అనుమానాస్పద రీతిలో కాలిపోవడం జరిగింది. దీని వలన కైతలాపూర్, మియాపూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్ లకు కొంత సేపు సరఫరాలో అంతరాయం జరిగింది. అప్రమత్తంగా నున్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ సర్క్యూట్ ద్వారా సరఫరా పునరుద్ధరించారు.

నగరంలో అత్యధిక డిమాండ్ 4350 మెగావాట్లకు పైగా వున్నప్పుడు ఈ కేబుల్స్ లో ఎలాంటి ప్రమాదం జరగ లేదు. ఉదయం పూట డిమాండ్ అతి తక్కువగా వున్నప్పుడు ప్రమాదం జరగడం పలు అనుమానాలు రేకిస్తున్నది. ఈ తరుణంలో తెలంగాణ ట్రాన్స్ కో & జెన్ కో సిఎండి  SAM రిజ్వి  పోలీస్ ఎంక్వైరీ కి ఆదేశించారు

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన దక్షిణ డిస్కాం సిఎండి  ముషారఫ్ ఫరుకి  మాట్లాడుతూ, దీని ప్రభావం విద్యుత్ సరఫరా పై పడకుండా ఉండేందుకు గాను తగు చర్యలు తీసుకున్నామని సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవన్నారు. సిబ్బంది అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, సబ్ స్టేషన్లు, ఇతర పీటీఆర్ ల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4