కదలిక, నడవలేకపోతున్న 18 నెలల శిశువు
న్యూరోమానిటరింగ్ తో సంక్లిష్టమైన తలకి వెన్నెముకకి మధ్యలో మెడ మీద ఉన్న కణితిని తొలగించి..
శిశువు నడిచేటట్లు చేసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్ :
వెన్నెముక నుండి తలకు మధ్యలో సుమారు ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల దూరంలో ఉన్న C1-C2 నుండి T2-T3 వరకు విస్తరించి ఉన్న కణితి కారణంగా 18 నెలల శిశువు గత ఎనిమిది నెలలుగా ఏడవడం, తల తిప్పకపోవడం, తీవ్రమైన కాలు నొప్పి, నడవలేని స్థితి, శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంది. మొదట తల్లితండ్రులు మెడ పట్టేసిందేమో అని భావించారు. రోజులు గడిచే కొద్దిగా శిశువు తీవ్రంగా ఏడవడం, ఏమి తినకపోవడంతో చాలా హాస్పిటల్స్ ను సంప్రదించారు. క్లిష్టమైన మెడ భాగంలో కణితి ఉందని గుర్తించారు. తల్లి తండ్రులు ఇతర హాస్పిటల్స్, డాక్టర్స్ ని సంప్రదించనా.. అతి చిన్న వయసు (18 నెలల) కారణంగా చాలా మంది శస్త్రచికిత్స నిర్వహించడానికి ముందుకు రాలేదు. అప్పుడు హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోస్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. MRI స్కాన్ తో నడవలేని స్థితికి కారణం C1-C2 నుండి T2-T3 వరకు విస్తరించి ఉన్న కణితి అని నిర్దారించి సర్జరీ న్యూరోమానిటరింగ్ పద్ధతిలో కణితిని పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స జరిగిన రెండవ రోజు నుంచే శిశువు పరిస్థితి మెరుగుపడటం, వారంలోనే 60-70% మెరుగైంది. ఇప్పుడు శిశువు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నది మరియు నడవగలుగుతుంది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూరోమోనిటరింగ్, ఇంట్రాఆపరేటివ్ న్యూరోఫిజియోలాజికల్ మానిటరింగ్ (IONM), న్యూరల్ మానిటరింగ్ అని కూడా పిలుస్తారన్నారు. ఇది శస్త్రచికిత్స సమయంలో మెదడు, మెదడు వ్యవస్థ, వెన్నుపాము లేదా నరాలను పర్యవేక్షించడానికి ఉపయోగించే అతి తక్కువ హానికర ప్రక్రియ. న్యూరోమానిటరింగ్ లక్ష్యం శస్త్రచికిత్స సమయంలో నాడీ వ్యవస్థకు కలిగే నష్టాన్ని ముందుగా గుర్తించడం, సర్జన్ కి, అనస్థీషియాలజిస్ట్ కి హెచ్చరించడం, తద్వారా వారు జాగ్రత్తపడతామన్నారు “చిన్న పిల్లలపై అటువంటి సున్నితమైన ప్రక్రియను నిర్వహించడం ఎంతో అనుభవం, ఖచ్చితత్వంతో కూడుకున్నదన్నారు. దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో చాలా ముఖ్యమైనదని చెప్పారు.
అనంతరం శిశువు తల్లి తండ్రులు మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు, అనుభజ్ఞులైన డాక్టర్స్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్ వల్లనే మేము ఈ రోజు సంతోషంగా ఉన్నాము అని అన్నారు.డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు.