26
హాలీవుడ్లో రీమేకే కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్ లలో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించింది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇంతకు ముందు కొరియన్లో రీమేక్ చేశారు.
మలయాళ, తమిళ, తెలుగు, హిందీ, కన్నడలో ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా మలయాళంలో ఈ చిత్రం విడుదలైంది. తర్వాత అదే పేరుతో తెలుగు, హిందీలో దృశ్య పేరుతో కన్నడలో, పాపనాశం పేరుతో తమిళ్లో తెరకెక్కింది. దానికి సీక్వెల్గా రూపొందిన దృశ్యం2 కూడా విజయవంతమైన విషయం తెలిసిందే.