42
నిన్న మొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఆదివారం రిలాక్స్ డ్ మూడ్ లోకి వచ్చారు. సీ ఎం రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు విద్యార్థులతో పుడ్ బాల్ ఆడుకున్నారు. ఆయన పాలకమండలి సభ్యులు పొన్నం ప్రభాకర్ బైక్ రైడ్ తో ఎంజాయ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా..
వేములవాడ తిప్పాపుర్ బస్ స్టాప్ నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు వేములవాడ విధుల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా బైక్ నడుపుతూ వేములవాడ ప్రజలను ఆకట్టుకున్న మంత్రి పొన్నం..
మంత్రి పొన్నం ప్రభాకర్ నడుపుతున్న బైక్ పై వెనకాల కూర్చొని ప్రజలకు అభివాదం చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . అనంతరం ఓ హోటల్ చాయ్ తాగుతూ ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..