21
రామేశ్వరం (NEWS): భారత్‌కు చెందిన 23 మంది జాలర్లను శ్రీలంక నేవి అదుపులోకి తీసుకుంది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను దాటి తమ జలాల్లో చేపల వేట చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. శనివారం సహాయరాజ్, జేమ్స్ అనే ఇద్దరు జాలర్లకు చెందిన పడవల్లో 23 మంది పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో చేపల వేటకు వెళ్లరు. ఆర్ధరాత్రి సమయంలో శ్రీలంక నేవీ వారిని అరెస్టు చేసి రెండు బోట్లను స్వాధీనం చేసుకుంది. రెండు నెలల వ్యవధిలో మూడో సారి భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం గమనార్హం. జనవరి నెలలో రెండు సార్లు 12 మందిని, మరో సారి 10 మందిని, వారి పడవులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.