సెంట్రల్ ఫోర్స్ లేకుంటే వైసీపీ అరాచకాలను భరించే పరిస్దితి లేదు. ఏపీలో కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో ప్రత్యేకించి నేను తిరిగి మాట్లాడుతున్నాను. కూటమికి ప్రజల సపోర్ట్ కళ్లారా చూశాను.వైసిపి రౌడీయిజాన్ని ఎన్నికల కమీషన్ అరికట్టాలి ” అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి. తో కలసి ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఎలక్షన్స్ బలాబలాలు గురించి చెప్పాలంటే…శ్రీకాకుళం లో 8 సీట్లు కూటమివే. వైజాగ్ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో పోటీ నువ్వా నేనా అనేలా ఉంది. జగన్ వల్లే స్టీల్ ఫ్యాక్టరీకి ఈ దుస్థితి వచ్చింది. వైసీపీకి చెందిన సిదిరి అప్పలరాజు, దువ్వాడ, ధర్మాన , తమ్మినేని తదితరులు అందరికీ ఓటమే..విశాఖలో భరత్ ఎంపీగా గెలవబోతున్నారు. ఉత్తరాంధ్ర లో జగన్ పార్టీ నాయకులు భూములు విపరీతంగా కబ్జా చేశేశారు. పవన్ లక్షా పదివేల మెజారిటీతో గెలవబోతున్నారు. సినీమా వాళ్లు ముందుకు వచ్చి, చంద్రబాబు, పవన్ లకు సపోర్ట్ చేయాలి. సినిమా వాళ్లు మాత్రం కనిసం సోషల్ మీడియా ద్వారా అయినా కూటమికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది/ రాబోయేది కూటమి ప్రభుత్వమే..జగన్ దుర్మార్గాలను చెళ్లిళ్లు షర్మీల, సునీతలు చెబుతున్నారు.. విజయమ్మ జగన్ గురించి ఏమి ఎందుకు మాట్లాడటం లేదో ఒక్కసారి అందరూ ఆలోచించాలి” అని అన్నారు
వైసిపి రౌడీయిజాన్ని ఎన్నికల కమీషన్ అరికట్టాలి: నట్టికుమార్..
32
previous post