Home ఆహారం వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..

by live
0 comment

వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి నుండి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ఎండాకాలంలో కొన్ని ప్రత్యకమైన ఆహార నియమాలు మరియు దినచర్య, రాత్రి పూట ఎలా ఉండాలి, అనేది తెలుసుకొని కొన్ని ఆరోగ్యం సూత్రాలు పాటిస్తే చాలు. గత వారం నుండి ఎండలు బాగా ఇరగదిస్తున్నాయి .ఉదయం 7 గంటల నుండి విపరీతమైన ఎండ వస్తుంది, రాత్రి పూట కూడా ఎండ 33 డిగ్రీస్ చూపిస్తుంది. కనుక ఎండలో తిరగకుండా చూసుకోండి, అత్యవసరమైతే తప్ప ఎండలోకి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు బయటికి రాకుండా చూసుకోండి. వేడి గాలులు బాగా వీస్తున్నాయి.. సాధ్యమైనంత వరకు ఎండలో రాకుండా చూసుకోండి.భారీ ఎండ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయండి.

ఆధాన కాలంలో మూడు రూతువులలో అంతిమ రూతువు గ్రీష్మ రూతువు. ఈ రుతువులో వాతావరణంలో ఎంతో శుష్కత్వం ఉంటుంది. శరీరం, ప్రకృతిలో రెండింటిలోనూ జలాంసం చాలా తక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు, వనస్పతులు, మానవులందరు చాలా బలహీనంగాను, నీరసంగా వుంటారు. శరీరంలో జీవశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. కటురసం ప్రబలంగా ఉంటుంది. వాత వర్ధకం, కఫ శామకం.

ఎండాకాలంలో పిత్తం ఎక్కువగా ఉంటుంది. ఎండ కారణంగా చమట బాగా రావటం జరుగుతుంది.కళ్ళు మంట, కాళ్ళు చేతులు మంట, ఛాతిలో మంట, పులిత్రేపులు, శరీరంలో వేడి పెరగటం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, రావటం. పొక్కులు ఎక్కువగా రావటం.దాహం వేయటం. పిత్త సంబంధమైన 40 రకాల మార్పులు ఉత్పన్నం అవుతాయి.

మే నెల మధ్యలో నుండి జులై నెల మధ్య వరకు ఉంటుంది. దీని ప్రభావం, నీటి మీద, చెట్ల మీద, జంతువుల మీద, మనుషుల మీద, వనస్పత్తుల మీద, సృష్టిలో సకల ప్రాణుల మీద పడుతుంది.

ఎండ దెబ్బకు, వేడి గాలి కి,మనుషులు, జంతువులు, చెట్లు క్షిణిస్తూ పోతుంటాయి.

వేసవి కాలంలో ఈ రూతువుని బట్టి మనం కొన్ని పద్ధతులు ననుసరించి శరీరాన్ని, ఆరోగ్యంగా, చురుగ్గా, హుషారుగా, బలంగా, ఉండేందుకు ప్రయతం చేయటానికి నాకు తెలిసిన ఆయుర్వేద, ప్రకృతి ఆహారనియమాలు చెపుతాను. దీని ఆచరించి ఎండాకాలంలో సంతోషంగా వుండండి.

ప్రకృతిపరంగా వుండే సమచయం కఫ ప్రశమ లేదా విపరీత గుణాలు లేదా ఆహార విహారాదుల సేవనంతో శాంతించటం. వాటి స్వభావిక స్థితికి తేవటం, జరుగుతుంది. జీర్ణక్రియ క్షిణించటం వలన ముఖం మీద చెమట పొక్కులు, మచ్చలు, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండటానికి తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు, తాజా కూరగాయలు, మధురం, వాతహారం ఉండి, శరీర స్నిగ్నత, తాజాదనం కాపాడేగలిగే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. పిత్తప్రకోపం కలిగించేవి ఎక్కువగా తీసుకుకూడదు. ఆమ్ల, లవణ, కటు రసయుక్తమైన ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు.మధురం, చెరుకు, ద్రాక్ష, వేప, కాకరకాయ, చేదు తీసుకోవాలి, కరక్కాయ, తానికాయ రసయుక్త ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము.

ధాన్యాల్లో పాత బార్లీ, బియ్యం, కందిపప్పు, పెసలు, మైసూర్ పప్పు, తీసుకోవాలి. తోటకూర, కాకర, పాలకూర, దొండకాయ, బెండకాయ, బీరకాయ, పచ్చి అరటి, బంగాళాదుంప, టమాటా, పుదీనా, కోత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చటి ఆకుకూరలు, ములక్కాడ, బూడిద గుమ్మడికాయ,తీసుకోవాలి. ఇలాయిచి, దాల్చిన చెక్క, లవంగం, ధనియాలు, అల్లం, కుంకుమ పువ్వు మొదలైన మసాలాలు తక్కువ మోతా దులో వాడాలి.

తాగే విషయంలో కుండలో వున్న నీరు, లేదా కూజా లో నీరు ఉంచి తాజాగా చల్లగా ఉండేటట్లు చూసుకొని తాగాలి చల్లని నీటితో నిమ్మరసం, మారేడు షర్భత్ చేసుకొని తాగాలి. మారేడు షర్భత్ తాగితే ఉదరానికి సంబందించిన జబ్బులు రావు. వట్టివేళ్ళు, గులాబ్ షర్బత్, నీటిలో కరిగే మీటా సత్తు, తాజా బత్తాయి రసం, కొబ్బరి నీళ్లు, పటిక బెల్లం, మామిడి రసం, చెరుకు రసం, సుగంది పాల జ్యూస్, తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్.నానా పెట్టిన బాధం, కిస్ మిస్, అంజీరా, ఎండు ఖార్జురం, చిరంజీ, తర్భుజా తియ్యటి ఖర్భుజా, తియ్యటి మామిడి, కమల పండు, బత్తాయి, కకిడి, షహాదూత్, అరటిపండు, దానిమ్మ, ఫలాస, ఉసిరి మురబ్బా, మామిడి రసం, గులకందా, తీసుకోవాలి.

జీవన చర్య
1. ఉదయం తెల్లవారుజామున లేవగానే కాలకృత్యములు తీర్చుకొనే ముందు మీ స్వభావన్నీ బట్టి చల్లని లేదా గోరు వెచ్చని నీరు రెండు గ్లాసులు కూర్చోని తాగాలి. నిలబడి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నీరు పరిగడుపున తాగితే free మోషన్ అవుతుంది. చాలా చక్కగా సుఖంగా మలమూత్ర విసర్జన జరుగుతుంది. పొట్టలోని సమస్త మలినపదార్దాలు బయటికి పోతాయి.ప్రతి రోజు రెండు లేదా మూడు సార్లు మలానికి వెళ్ళాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం గ్యాస్, రాదు.

2. ఎండాకాలంలో బావి, సెలయేరు, నీరు తాగటానికి చాలా మంచిది. వేసవిలో నీటిని తగినంతగా తాగాలి.
లేకపోతే డి hydration అవుతుంది.

3. ఉదయం లేవగానే వాకింగ్ కి పచ్చటి గడ్డి మీద నడవాలి, లేదా ఇసుక వున్న ప్రాంతంలో నడవాలి, చక్కటి గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో అది కూడా సూర్యోదయానికి ముందుగానే వాకింగ్ కి పోయిరావాలి. మనసు ఫ్రెష్ గా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. మానసిక ప్రశాంతం గా వుంటారు.

4. వేసవికాలంలో తేలికగా వుండే యోగాసనాలు, ప్రాణాయామం, సంధ్యావనం, చేస్తే సుఖాన్ని ఇస్తాయి.

5. తరువాత చల్లని నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేయటం వలన రక్తం కుపితం అవుతుంది.

6. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి రెండు సార్లు మినిమం స్నానం చేయాలి. చన్నీటితో కళ్ళు కడుకోవాలి. కాటన్ వస్త్రాలు, లైట్ కలర్స్ ఉండే దుస్తులు ధరించాలి. ముత్యాలు దండ వేసుకోవాలి. శరీరం పైన రోజు చందనం రాసుకోవటం చాలా మంచిది. సుగంధం ఇచ్చేవి ఆరోగ్యానికి best medicine.

7. ఎండలో ఇంటి నుండి బయటికి వెళ్ళేటపుడు కాటన్ దుస్తువులు వేసుకొని, గొడుగు, లేదా టోపీ, పెట్టుకొని బయలుదేరాలి. వడగాలి తగలకుండా ముఖానికి చేతి రూమాలు కట్టుకొని పోండి. చేతిలో చల్లని నీరు తీసుకోనిపోండి, ఏందికంటే ఎండ దెబ్బకు దాహం వేస్తుంది, ఈ చల్లని నీరు తాగితే ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ ముక్క కూడా ఒకటి ఉంచుకోండి, అరచేతులు, అరికాళ్లలో కొంచం ఆముదం తైలం, నీరు రాసి రోజు మాలిష్ చేయండి. వడ దెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.

8. మధ్యాహ్నం భోజనంలో తప్పకుండా ఉల్లిపాయ ముక్కలు మజ్జిగలో వేసి కలిపి తినాలి. కడుపు చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలలోపే భోజనం పూర్తి చేయాలి. రూతువుని బట్టి ఆహారం తీసుకోవాలి.

9.సాయంత్రం నిమ్మరసంలో ఉప్పు లేదా షుగర్ కలిపి షర్భత్ తాగాలి. లేదా చెరుకు రసం, బత్తాయి రసం తాగాలి. అంతే కాని మైదాతో చేసిన బజ్జిలు, పకోడీలు, బొండాలు, నూడిల్స్, స్నాక్స్, కూల్డ్రింక్స్, తాగరాదు.వీలుంటే పరిగడుపున కొబ్బరినీరు తాగండి, గ్యాస్, ఏసీడీటీ,తగ్గుతుంది. మలబద్ధకం రాదు. మలబద్ధకం వున్న వెళుతుంది. గ్యాస్ తో తలనొప్పి వచ్చేవారికి best medicine పరిగడుపున కొబ్బరినీరు తాగితే ఒక “పిత్తు ” వచ్చి తలనొప్పి, మెడలు గుంజటం, బీపీ కంట్రోల్ అవుతాయి. ట్రై చేసి చుడండి.

10 .రాత్రిపూట తేలికగా అరుగుదల అయ్యే ఆహారం తీసుకోండి. భోజనం రాత్రిపూట 7 గంటలలోపు తింటే ఉత్తమం,8 గంటలలోపు తింటే మద్యమం,9 గంటలకు తింటే విషమం, ఇది గుర్తించగలరు. భోజనం చేసిన రెండు గంటల తరువాత ఎవరైనా బలహీనంగా ఉంటే అశ్వగంధ చూర్ణం పాలలో వేసి కలిపి తాగాలి. అది కూడా వారానికి రెండు సార్లు మాత్రమే. రాత్రి త్వరగా నిదురపోవాలి, త్వరగా మేలుకోవాలి. మినిమం 8 గంటలు నిద్రపోవాలి. ఈ రూతువులో పడక మీద వేపాకులు లేదా అరటి ఆకులు, తామారాకులు పరుచుకోవచ్చును. రాత్రి పూట వెన్నలకు నిద్రపోతే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉంటుంది. చంద్రకిరణాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. ఆకాశం కింద వెన్నల కిరణాలకు మంచం మీద పడుకొని రేడియో లో వచ్చే చివర హవా మెయిల్ పాట వింటూ పడుకోండి అదొక అద్భుతం, అమోహం, అంతులేని ఆనందం. అంతేకాదు ఆకాశంలో మబ్బులు వైపు చూస్తూ మనం అనుకున్న బొమ్మలు, జంతువులు, ఇంకా రక రకాల జలచర జంతువులు ఉండేటట్లు ఊహించుకుంటే ఆకాశంలో అవి అక్కడ ఉన్నట్లుగా కనపడ్తాయి.చంద్ర కిరణాలు సోకితే ఆరోగ్యప్రదం.

11. రాత్రిపూట చల్లగా వున్న నీరు తప్పకుండా తాగాలి. ఆలా చేస్తే జీవితంలో మలబద్ధకం రాదు. వాత, కఫ దోషాలు కూడా కుపితం కాకుండా ఉంటాయి.

12. పగటివేల సత్తు పంచదారతో కలిపి చల్లని పానీయం తాగాలి.ఈ రోజుల్లో కరక్కాయ చూర్ణం 5 గ్రాములు నీటిలో వారానికి రెండు సార్లు తీసుకోవాలి.ఉదరానికి మంచిది.

13. వేసవికాలంలో యమ, నియమాలు, చక్కగా పటించాలి. సూర్యనమస్కారలు, yoga, ప్రాణాయామం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, చేయాలి. దీనితో నాభి చక్రం చైతన్యవంతంగా అయ్యేటట్లు చేయాలి, అప్పుడే కాలేయం, ప్లీహం, చిన్న ప్రేవులు ఉత్తేజితం అవుతాయి. జాటారాగ్ని ని ప్రదీప్తం చేసే ఆసనాలు, వజ్రాసనం, ధనురాసనం, అర్ధ చక్రాసనం, సర్వాంగాసానం ఇలాంటివి కొన్ని ఆసనాలు చేయాలి.

14. ప్రాణాయామం, సీతలి, సీత్కరి, చంద్రవేది, అనులోమ విలోమ, భ్రమరి, చేయాలి.కొన్ని ముద్రలు వరుణ ముద్ర, విపరీతకరణి ముద్ర తదితర మొదలగు చేయాలి.

15. శోధన.. క్రియలు కూడా చేయాలి. సాయంత్రం నస్యం పీల్చటం హితకారం.

తదుపరి శీర్షిక వచ్చే సంచికలో మిత్రులారా నేను గత సంవత్సరం 6నెలల నుండి ఎప్పటికప్పుడు మీకు హెల్త్ టిప్స్ అందిస్తున్నాను. కనుక ఈ శీర్షిక నచ్చిన, నచ్చక పోయిన కామెంట్స్ చేయండి, దీని వలన నాకు ఉత్తేజాన్ని, ఉత్సహంనూ కలిగిస్తుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4