హైదరాబాద్ : మూసా పేట గూడ్స్ షెడ్ రోడ్డు లో పార్కింగ్ చేసిన భారీ లారీలు, కంటైనర్ లారీలు, భూమిలో కుంగి పోయి ఓ వైపు ఒరిగి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గూడ్స్ షెడ్ రోడ్డు లో ఐసీడీ వరకు సుమారు 8 వాహనాలు రోడ్డు వైపు ఒరిగి, మరో వైపు వాహనాల టైర్లు గాలిలో ఉన్నాయి. గత నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలో మంచి నీటి పైపు లైన్ పనులు జరిగాయి. లింగంపల్లి నుంచి అల్వాల్ కు మంచి నీటి మెయిన్ లైన్ ఉంది. రైల్వే సమీపం నుంచి ఉండటం వలన సమస్యలు వచ్చినప్పుడు రైల్వే అధికారుల అనుమతులు తీసుకొని చేయాలంటే మరమ్మతులకు ఇబ్బందిగా ఉండేది. దీంతో రాజీవ్ గాంధీ నగర్ ఐసిడి మలుపు నుంచి జింకల వాడ కు వెళ్ళే దారిలో భరత్ నగర్ బ్రిడ్జి వరకు అండర్ గ్రౌండ్ గా భారీ పైపులైను లు వేసి పనులు చేసి మట్టి మూసివేశారు. కానీ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. గూడ్స్ షెడ్ రోడ్డు లో ఐసీడీ కి నిత్యం భారీ లారీల ద్వారా ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. దీంతో గూడ్స్ షెడ్ రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. మంగళవారం కూడా అదే క్రమంలో పార్కింగ్ చేశారు. సాయంత్రం కురిసిన వర్శాన్నికి పైపు లైన్ పై వేసిన మట్టి దిగబడంతో రెండు కంటైనర్ లారీలు దిగబడ్డాయి. ఇందులో ఒక్కటి లోడ్ ఉంది. ఒక డిసిఎం, రెండు క్రేన్ లు, మూడు భారీ లారీలు కూడా ధిగబడ్డాయి. ఒక వైపు టైర్లు భూమిలో పూర్తిగా కుంగిపోయి , మరో వైపు టైర్లు గాలిలొ ఉన్నాయి. ఏ క్షణమైనా రోడ్డు పై పడే అవకాశం ఉంది. వెంటనే క్రేన్స్ సహాయం తో వాహనాలను తీయాలని స్థానికులు కోరుతున్నారు.
35