29
హైదరాబాద్ : వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు నిన్న 46 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు. మరోవైపు ఇవాళ, రేపు ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.