యువరాణి రోజా గొప్ప నటినా… ఆస్కార్ అవార్డులు కొట్టిందా!/ కనీసం గెటప్ శీను , ఆది, సుధీర్ వంటి నటుల కోవలో స్కిట్స్ చేయగలదా? అని నటుడు ఆర్.పి. (జబర్దస్త్ ఫేమ్) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్ నట్టికుమార్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయనతో కలసి ఆర్.పి. మాట్లాడారు. రోజా మాకు గౌరవం ఇస్తే ..మేము గౌరవిస్తాం. మమ్ములను చిన్న నటులుగాచులకన భావనతో మాట్లాడటం రోజాకు ఎంతమాత్రం తగదు. జగన్ చేసే దుర్మార్గాలను ఆమె అడగలేదు కానీ వారానికోసారి రోజా తిరుమల పోతుంది. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.
నాకు రాజకీయ అనుభవం లేదు. కానీ నెల్లూరు వెమిరెడ్డి దంపతుల సర్వీస్ నచ్చి వారికి సపోర్ట్ చేస్తున్నాను.
వారు వివాద రహితులు,సౌమ్యులు..వారికి సపోర్ట్ చేసె క్రమంలో రాజకీయాలలో తిరిగాను..జగన్ ఓడిపోబోతున్నాడు. జగన్ ఫించన్ ఇస్తే సరిపోదు .ఏపీకి అభివృద్ధి కావాలి..విజయసాయి రెడ్డి, బొత్స ,అనిల్ యాదవ్ ఓడిపోతున్నారు. ఓటమికి కారణం రౌడీ రాజకీయమే. షర్మీలను తిట్టించటం..కోడికత్తి, వివేకా మర్డర్, గులకరాయి డ్రామా వంటి వాటివల్ల దగ్గరివారందరు జగన్ కు దూరంగా ఉంటున్నారు..ఎవడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేది వీళ్లకు కావాలి..జగన్ కు ఒక పెళ్లి కావటం వల్లే వివేకా మర్డర్ జరిగింది.. ఇక తిరుమల కొండపై అన్న ప్రసాదం కూడా సరిగ్గా ఉడకటం లేదు..తిరుమల లడ్టు కూడా కల్తీ అయిపోయింది.హుండీ డబ్బులను నిలువు దోపీడి కానుకలు సైతం ఏమవుతున్నాయో అర్ధం కావడం లేదు.
టిడిపి ప్రభుత్వం అద్బుతంగా తిరుమలను అభివృద్ది చేస్తే, జగన్ హయాంలో పరిస్థితులు దయనీయంగా మారాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలలో కూడమి కి ప్రజల సపోర్ట్ బాగుంది. కూటమిని
140 సీట్లతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజయ్ మాల్యా లా జగన్ లండన్ పోవడం ఖాయం” అని అన్నారు.
రోజా మాకు గౌరవం ఇస్తే ..మేము గౌరవిస్తాం. ఏపీలో ఓడిపొయే మొదటి సీటు రోజానే..
జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి.
27