25
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రైల్వే ప్రొటెక్షన్ స్సెషల్ ఫోర్స్ (RPSF) లో ఎస్ ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను రైల్వేశాఖ భర్తీ చేయనున్నారు. మొత్తం 4,660 పోస్టులు ఉన్నాయి. వీటిలో కానిస్టేబుల్ 4,208.. ఎస్ ఐ పోస్టులు 452 ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ ఐ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జులై 2024 నాటికి 18 నుండి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్ ఐ ఉద్యోగాలకు 20 నుండి 28 ఏళ్లు మధ్య ఉండాలి. దరఖాస్తు పీజు రూ. 500. ఎస్‌సి, ఎస్‌టి, మాజి సైనిక ఉద్యోగలు, మహిళు, ట్రాన్స్ జెండర్, మైనారిటి, ఇబిసి అభ్యుర్థులకు రూ. 250 గా నిర్ణయించారు. దరఖాస్తులు ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు స్వీకరిస్తారు.