Home జాతీయం రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేపట్టాలి 

రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేపట్టాలి 

బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బిజెపిదే 

0 comment

బీసీలంతా ఏకమైతేనే రాజ్యాధికారం

రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేపట్టాలి

బీసీ జర్నలిస్టులు సోషల్ మీడియా వారియర్లుగా మారాలి

బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ

మోడీ హయాంలో అన్ని రంగాల్లో బీసీలకు అవకాశాలు

విద్య, కేంద్రీయ విద్యాలయాలయాల్లో బీసీలకు రిజర్వేషన్లు

బీసీలు రాజ్యాధికారం చేపట్టేందుకు జర్నలిస్టులు కృషి చేయాలి

బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బిజెపిదే

పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు సీట్లు ఇచ్చిన ఘనత బిజెపిదే

బిజెపి ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్ :

బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే మరో ఉద్యమం జరగాలని రాజ్యసభ సభ్యులు బిజెపి జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హైదరాబాదులోని హోటల్ సెంట్రల్ కోర్టులో బీసీ జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం బీసీ జర్నలిస్టులు సోషల్ మీడియా వారియర్లుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రకులాల చేతిలో మీడియా సంస్థలు ఉన్నప్పటికీ పనిచేస్తున్నది బీసీ జర్నలిస్ట్ లేనని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఇందులో భాగంగా కాకా కలేకర్ కమిషన్ వేస్తే దానిని కనుమరుగు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత సూచించిన నేపథ్యంలో నెహ్రూ మూలంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాలేకపోయాయని అన్నారు. బీసీలు కేవలం ఎవరి కులాలకు వారు కాకుండా బీసీ కులాలు అందరూ ఏకమై బీసీలుగా ముందుకు సాగితే బీసీలు రాజ్యాధికార దిశగా అడుగులు వేయవచ్చన్నారు. దేశంలో 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 27 మంది ఓబీసీల కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చారన్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 34 శాతం నుండి 18 శాతానికి బీసీ రిజర్వేషన్ తగ్గించాలని విమర్శించారు. కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. బిజెపి ఓబీసీ సెల్ నాయకురాలు నాగ పరిమళ మాట్లాడుతూ దేశంలో 97 శాతం మీడియా సంస్థలు అగ్రకులాల చేతిలోనే ఉన్నాయని బీసీ రాజకీయ నేతలకు సంబంధించిన వార్తలు సమాచారాన్ని కేవలం మూడు శాతమే అందిస్తున్నాయని ఇది దురదృష్టకర పరిణామన్నారు. బీసీ జర్నలిస్టులు ఏకమై ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీలను చైతన్యపర్చాల్సిన బాధ్యత బీసీ జర్నలిస్టుల పైన ఉందన్నారు. సీనియర్ జర్నలిస్టు ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ అనాదిగా అగ్రకులాల నాయకులు అందరూ ఏకమై బీసీ నాయకులను వ్యూహాత్మకంగా తొక్కి వేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమల్, మేడం మధుసూదన్, విద్య వెంకట్, దాసరి శ్రీనివాస్, ఉప్పు సత్యనారాయణ, కోట్ల చంద్రకాంత్, తేళ్ల హరికృష్ణ, కార్టూనిస్ట్ నారు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4