30
- మనికొండలోనీ హోటల్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు ఆలిండియా కృష్ణ మహేష్ ప్రజసేనా జాతీయ అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ, పి.మల్లేష్, జితేందర్, వరుణ్ నాయుడు,నవీన్ తదితర అభిమానుల సమక్షంలో జరిగిన వేడుకలలో హీరో సుధీర్ బాబు కేక్ కట్ చేసి చాలా భావోద్వేకం తో మాట్లాడుతూ నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, సినీ జన్మనిచ్చింది మావయ్య కృష్ణ ని, ఈ మధ్య తన చిత్రాలు కొన్ని అపజయం పాలైనా ఇక పై అభిమానులు గర్వించే విధంగా సినిమాలు చేస్తానని, అభిమానులకు అండగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల నిమిత్తం నిధి ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు చేయాలనుకుంటున్నాట్టు చెప్పారు, మే 31 న కృష్ణ జయంతి కానుక గా తను నటిస్తున్న చిత్రం ” హరోం హర”, విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు, ఆ చిత్రం ట్రైలర్ అభిమానులకు ప్రదర్శించారు. ఖాదర్ ఘోరీ హీరో సుధీర్ బాబుకు అభిమానుల తరుఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గజమాల తో సత్కరించారు, హీరో చేసే సహాయసేవకార్యక్రమాలకు మేమంతా కలిసివుంటామని “హరోం హర”, చిత్రవిజయాన్ని ఆకాంక్షించారు. విజయవాడ తాడిశివ, వైజాగ్ మురళీ, విజయనగరం రమణ రాజు, ఖమ్మం రంగారావు, భద్రాద్రి కొత్తగూడెం కనగాల రాంబాబు, సాయిజీ రావు,కాంతరాజు, సత్తుపల్లి నాని తదితర అభిమానులు పాల్గొన్నారు.