28
మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన రౌడీ షీటర్
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉంటున్న బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్లోని నివాసంలోకి రౌడీ షీటర్ లక్ష్మణ్ చొరబడ్డాడు.
నేరుగా విజయలక్ష్మి ఉండే ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు.. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో విజయలక్ష్మి ఇంట్లో లేదని సిబ్బంది తెలిపారు.