మంచిర్యాల (NEWS): తమతోపాటు 10వ తరగతి వరకు చదువుకున్న మిత్రడు అకాల మరణం చెందడంతో తోటి స్నేహితులు కలత చెందారు. మిత్రుని కుటుంబానికి అండగా నిలబడ్డారు. మిత్రుడి కుటుంబ సభ్యులకు రూ. 25,000/- లు అందజేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన తోకల తిరుపతి (IFTU) జిల్లా కార్యదర్శి రోడ్డు ప్రమాదం లో చనిపోయారు. ZPHS జైపూర్ 2000 సంవత్సరంలో తమతో పాటు పదవ తరగతి వరకు చుదువుకున్న మిత్రుని మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేక పోయారు. ఆదివారం మంచిర్యాల మర్క్స్ భవన్ లో జరిగిన మిత్రుని (తోలక తిరుపతి) సంతాప సభ లో క్లాస్మేట్స్ అంతా కలసి రూ. 25,000 అందజేశారు. తన భర్త స్నేహితులు అందించిన సహాయం పట్ల భార్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ ఎస్ జైపూర్ 2000 వ సంవత్సరపు పూర్యవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత
29
previous post