29
హైదరాబాద్ : ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న రామసహాయం రఘురామి రెడ్డి కోడలు, ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ అమ్మాయి ఆశ్రిత ఖమ్మం ప్రజల వద్దకు వెళ్లి తన మామకు ఓటు వేయండి అంటూ తనదైన శైలి లో ప్రజలను అభ్యర్థిస్తుంది.
మా మామ గారు ఏ పని మొదలుపెట్టిన అది ఎంతటి కష్టమైన పూర్తి చేస్తారు. అలాగే మీ సమస్యలేమైనా వాటిని ఢిల్లీ వరకు తీసుకెళ్లి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమ మా మామగారి పై చూపించి మే 13 న జరగబోయే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురామి రెడ్డి ని ఢిల్లీకి పంపిద్దాం. మన విక్టరీ వెంకటేష్ మే 7 వ తేదీన ఖమ్మం వస్తున్నారు. మా మామకి సపోర్ట్ చేయడానికి అంటూ ప్రజలకు తెలిపింది ఆశ్రిత.