37
హైదరాబాద్ :” దుబాయ్లో మరోసారి వర్షాలు దంచికొట్టాయి. నిన్న భారీ వర్షం కురవడంతో అక్కడి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు విమానాలను రద్దు చేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ చేయాలని సూచించారు.