30
బ్యాంకింగ్ రాంగానికి సంబంధించి కొన్ని నిబంధనలు పాటించడంలేదని యాక్సిస్ బ్యాంక్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. రుణాలు, రిస్క్మేనేజ్ మెంట్, కరెంట్ ఖాతాలకుసంబంధించి ఆర్బిఐ నిబంధనలు పాటించకపోవడంతో రూ. 90.92 లక్షలు జరిమానా విధించినట్లు వెల్లడించింది. అదేవిధంగా బంగారంపై రుణాలు ఇచ్చే మణప్పురం ఫైనాన్స్‌పై కూడా ఆర్బిఐ జరిమానా విధించింది . నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన ఆర్బిఐ నిబంధనలు పాటించకపోవడంతో మణప్పురం ఫైనాన్స్‌పై రూ. 42.78 లక్షలు జరిమానా విధించింది. ముందుగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. అనంతరం కంపెనీ ఇచ్చిన సమాధానం పరిగణలోకి తీసుకొన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.