32
ఆంధ్రప్రదేశ రాష్ట్ర ముఖ్య మంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాన్ని చెప్పాడు. గత పదేళ్లలోతెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమాన్ని భారాస ప్రజల్లోకి తీతీసుకెళ్లలేకపోయిందన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైందని అన్నారు. ఆ పార్టీ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మారని జగన్ పేర్కొన్నారు.