33
హైదరాబాద్ : బిఎండబ్య్లూ నుంచి సరికొత్త మోడల్.. 3.5 సెకన్లలోనే 100 కి.మీ..
ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ BMW ఇండియాలో కొత్త మోడల్ కారును విడుదల చేసింది. దీని పేరు ‘M4 కాంపిటీషన్ M xDrive’. ఇది సరికొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని, స్పోర్టీ స్టైలింగ్ డిజైన్తో మార్కెట్లోకి వచ్చిందని BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా ఒక ప్రకటనలో తెలిపారు. కారు ధర రూ.1.53 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుందని తెలిపారు.