28
ఫేక్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. అందులోభాగంగా ప్రభుత్వ యాప్స్‌కు లేబుల్స్‌ను తీసుకురానుంది. ‘ఎక్స్’లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసేందుకు వీలుండడంతో ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు ‘ఎక్స్’లో గ్రే టిక్ ఇచ్చారు. దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని సులువుగా గుర్తించడం సాధ్యపడుతోంది. అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్ లేబుల్‌ను తీసుకొచ్చింది.