32
గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బేగంపేటలోని ప్రజా భవన్‌లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై బాంబు స్క్వాడ్ సిబ్బందితో ప్రజా భవన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికార నివాసనికి వెళ్లి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సందర్శకులను క్షుణ్ణంగా పరిశీలిచాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.