Home ఆంధ్ర ప్రదేశ్ ప్రచార పర్వం ముగిసింది…

ప్రచార పర్వం ముగిసింది…

ప్రలోభ పర్వానికి తెరలేచింది...

0 comment

పంపకాలు ప్రాదేయపడటాలు..మిగిలింది ఒకే రోజు..!

తెలుగు రాష్ట్రాలలో సోమవారం – 13 మే రోజు పోలింగ్ జరగనుంది…!

తెలంగాణ లో 17 పార్లమెంట్ స్థానాలు

ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13 న ఒకేరోజు పోలింగ్ జరగబోతోంది..!

తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే అందరి దృష్టి ఎక్కువగా ఉంది!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలపై అత్యంత ఉత్కంఠ నెలకొంది…

హైదరాబాద్ :

రాజకీయంగా పూర్తి స్థాయి అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటు టీడీపీ కూటమీ.. ఇటు వైసీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి… ఎవరు గెలిచినా… ఓడిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తెే అటు టీడీపీ కూటమి ఎక్కువ గెలిచినా… వైసీపీ ఎక్కువ గెలిచినా… మొత్తం 25 సీట్లు ఎన్డీయే కూటమి వే అనేది బహిరంగ రహస్యమే.!

టీడీపి కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అటు వైసీపీ తోనూ సఖ్యత కొనసాగిస్తున్నందున… బీజేపీ కి రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నష్టమేమీ ఉండదు.

తెలంగాణలో బీజేపీ కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది…అసెంబ్లీ విజయం తర్వాత కాంగ్రెస్ బలహీన పడుతున్నట్లు వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి… ఎన్నికలు కీలక దశకు వచ్చేసరికి ఆ పార్టీ మరింత బలహీనంగా మారిందని… గెలిచే అవకాశాలు పెద్దగా లేకపోయినా… కేసీఆర్ ఉదృత ప్రచారంతో బీఆర్ఎస్ అంచనాలను మించి ప్రజాదరణను పెంచుకుందనే అభిప్రాయం వినిపిస్తోంది…

కాంగ్రెస్ బలహీనం.. మోడీ చరిష్మా..బీఆర్ఎస్ కోలుకుంటున్న దశలో ఉండటం బీజేపీకి అనుకూల అంశాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..చాలా చోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలను బీఆర్ఎస్ ప్రభావితం చేస్తుందనే అంచనా ఉంది.. అది అంతిమంగా బీజేపీకి లాభించవచ్చనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న అభిప్రాయం…చూడాలి పోలింగ్ తర్వాత పరిస్థితి!

–  సబితా రాజు.డి

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4