రామగుండం పోలీస్ కమిషనరేట్ (NEWS): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం.. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో
ఎన్నికలను ప్రభావితం చేసే, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండాకట్టుదిట్టమైన ముందస్తు భద్రత చర్యలలో భాగంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, లాడ్జ్ లను మరియు వాహనాలను ఆకస్మికంగా పోలీసులు తనిఖీ లు చేపట్టారు. విస్తృతస్థాయిలో వాహన తనిఖీలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీ లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని , నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే ముఖ్య ఉద్దేశం తెలిపారు.
పెద్దపల్లి, మంచిర్యాల పట్టణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
27