*పిల్లల చెడు వ్యసనాలకు తల్లితండ్రులే బాధ్యులా!*
ఈ విషయం చెప్పడానికి రాయడానికి చాల బాధగా ఉంది *ఒక పిల్లవాడు జీవితం లో ఉన్నత స్థితికి తల్లితండ్రులే కారణం అయినప్పుడు ఒక పిల్లవాడు చెడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు కారణం కాదా?*
ప్రొద్దుటే లేచి ఏ న్యూస్ పేపర్ చూసినా టీవీ ఛానల్ చూసినా మానభంగాలు సామూహిక మానభంగాలు హత్యలు అంటే మాములు హత్యలు కాదు కొత్తగా ఎలా హత్య చెయ్యచ్చో తెలుసుకుని లేదా కనిపెట్టి మరీ హత్య చేస్తున్నారు. ఇంకా విచిత్రంగా మైనర్ బాలికలను రేప్ చెసి హత్య చెయ్యడం ఆ రేప్ లో మైనర్ బాలురు పాల్గొనడం.
*ఏమైపోతోంది మన సమాజం?*
*ఎక్కడికి పోతున్నాం మనం*
గతంతో పోలిస్తే నేడు పేదపిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు. చదువుకుంటున్న వాళ్ల శాతం బాగా పెరిగింది.
*ఇదివరకు కంటే ఇప్పుడు సమాజం లో హింస బాగా పెరిగింది. యువతీయువకుల మధ్య దూరం తగ్గిపోయింది వస్త్రధారణ విషయంలో కూడా పెద్దగా తేడా ఉండటంలేదు మోహం చూసి మాట విని ఆడో మొగో తెలుసుకోవలసి వస్తుంది నేటి తరంలో అన్ని అనుభవించాలి అనే ఆత్రుత చాల ఎక్కువగా ఉంది*
*కొంత మంది చదువు కూడా బాగా చదువుకుంటూనే తప్పుడు పనులు చేస్తున్నారు. చాలామంది పేరుకు మాత్రం చదువుకుంటూ పూర్తిగా వక్రబుద్ధితో తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు*
అయితే నేటి యువతరం చాల తెలివైనవాళ్లు మేధావులు తెలియక తప్పులు చేస్తున్నారా అంటే కాదనే అంటాను అన్ని తెలిసి కావాలనే తప్పులు చేస్తున్నారు
*జీవితాన్ని చాల ఈజీ గ తీసుకుంటున్నారు తెలిసినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య థోరని యువతలో చాల ఎక్కువగా కనిపిస్తోంది*
చెడ్డపనులు ఎలా చెయ్యాలో తెలియచెయ్యడానికి సినిమావాళ్లు వాళ్ల పాత్ర దివ్యంగా పోషిస్తున్నారు సినిమా వాళ్లకు డబ్బు సంపాదించడమే ముఖ్యం ఉదాహరణకు మనిషిని చంపడం ఎంత సులువో పుష్ప కేజిఫ్ లలో చూపించారు తరవాత ఏమైంది సినిమాలు బాగా హిట్ అయ్యి కాసులవర్షం కురిసింది కానీ ఆ సినిమాలు చూసి ఎంతో మంది సులువుగా అమాయకులను శత్రువులను ఇంకా మొగుడిని పెళ్ళాం పెళ్ళాన్ని మొగుడు చంపేస్తున్నారు. *ప్రేయసి ప్రియుడు తో కలసి అడ్డున్న వాళ్ల అడ్డు తొలగించుకుంటున్నారు. అభంశుభం తెలియని ముక్కు పచ్చలారని పసిబిడ్డలని కిరాతకంగా హత్య చేస్తున్నారు*
ఇప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర ఖరీదైన స్మార్ట్ ఫోన్ లు కావలసినంత హై స్పీడ్ డేటా ఇరవైనాలుగు గంటలు లభ్యం. నిజమే ఆ *నెట్ ని తమ చదువులకు విజ్ఞానానికి వినియోగిస్తే వాళ్ళు ఎంతో లాభాన్ని పొంది ప్రయోజకులవుతారు.* కానీ ఎంతమంది విద్యార్థులు నెట్ ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు? చాల మంది విద్యార్థులు ఎప్పుడు చూసిన వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. చివరికి క్లాస్రూమ్ లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ఆవి శ్రద్ధగా వినకుండా వీడియో గేమ్స్ ఆడుతుంటారు. *గురువు అంటే శిష్యులకి అసలు గౌరవమే లేదు గురువు నుండి వీలైనంత విజ్ఞానాన్ని పొందాలన్న ధ్యాస శిష్యులకు కూడా లేదు. ఇంక గురువులు చాల మంది ఏదో మొక్కుబడిగా పాఠాలు చెప్పడం పీరియడ్ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూడడం క్లాస్ లో ఆ మాటలు ఈ మాటలు చెప్పి టైం వెస్ట్ చేస్తున్నారు. ఎవరికీనా మంచి కంటే చెడె తొందరగా అర్ధమవుతుంది.*
నేడు తల్లితండ్రులిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బు బాగా సంపాదిస్తున్నారు తమ పిల్లలకి ఏలోటూ లేకుండా పెంచాలని ఎంతో ఆశ పడుతున్నారు కొందరైతే తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని పిల్లలు ఏమడిగితే అది ఇస్తున్నారు లేటెస్ట్ మోడల్ టూ వీలర్స్ కారు లు కూడా కొని ఇస్తున్నారు. లక్షలు కోట్లు ఖర్చుపెట్టి దేశ విదేశాల్లో చదివిస్తున్నారు చేతినిండా డబ్బు బ్యాంకు లో కావలసినంత బ్యాంకు బాలన్స్ ఇంక క్రెడిట్ కార్డులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది *మరి పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాంటి సహవాసాలు చేస్తున్నారో గమనిస్తున్నారా? మీరు ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నరో తెలుసుకుంటున్నారా?*
*ఉ హు ఎందుకంటే మీకు అంత టైం లేదు ఉన్న టైం అంతా డబ్బు సంపాదించడానికి మీ పార్టీ లకు మీ మీటింగ్ లకు ఖర్చు పెట్టేస్తున్నారు ఇక్కడ మీరిచ్చిన డబ్బు ఎక్కువై మీ పిల్లలు సిగరెట్ లు తాగుతూ పబ్ లకు వెళ్లడం ఒంటరిగా కాదు ఫ్రెండ్స్ తో అమ్మాయిలతో మందు కొట్టడం ఇంకా డ్రగ్స్ తీసుకోవడం వాటికీ బానిసవడం పూర్తిగా ఎన్ని విధాలుగా చెడిపోవాలో అన్ని విధాలా చెడిపోతున్నారు. పెళ్లి కాకుండానే శృంగారన్ని రుచి చూస్తున్నారు అమ్మాయిలను డబ్బుతో లోబరుచుకుంటున్నారు. వారు కాదంటే వాళ్ళని అనుభవించి హత్య చెయ్యడానికి కూడా వెనకాడటం లేదు.*
*దీనికి కారణం ఎవరు? ఓ తల్లితండ్రులారా మీరు కాదా?* మీ పిల్లలు ఎలా వున్నారు? ఏమి చేస్తున్నారు?
*హాస్టల్ లో ఫుడ్ బాగుందా అని అడుగుతారే కాని హాస్టల్ లో మీ పిల్లల స్నేహితులెవరు? ఎలాంటివారు? అని తెలుసుకుంటున్నారా?మీ పిల్లల దినచర్యను గమనించారా?* మరి మీ పిల్లలని పట్టించుకోకపోతే వాళ్ళు దుర్వ్యసనాలకు లోనై చెడిపోతున్నారు వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు?
*మరి ఇది మీ పెంపకం లో లోపం కిందకు రాదా? మీ పిల్లలు చెడిపోతే ఆ చెడ్డ పేరు మీకు వస్తుందికదా? మీ పరువు మర్యాద మంట కలుస్తుంది కదా!అప్పుడు కళ్ళు తెరిచి ఏమి లాభం? జరగవలసిన నష్టం జరిగిపోతుంది*
ఒక రైతు విత్తనాలు జల్లేక ఎంతో శ్రద్ధ తీసుకుని పంట చేతికి వచ్చే వరకు నిద్రపోడు. పంటకు అవసరమైన నీరు పెడతాడు ఎరువులు వేస్తాడు పంట పాడవకుండా మందులు కొట్టి కాపాడుకుంటాడు అంతే కాదు కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు ఏరి పారేస్తాడు
*మీ పిల్లల పట్ల ఒక రైతుల పూర్తిగా శ్రద్ధ కనపరచలేరు కానీ రైతు చేసే పని లో కొంత మేర మీ పిల్లల మీద శ్రద్ధ తీసుకున్నా మీ పిల్లల భవిషత్త్ అద్భుతంగా ఉండదూ!*
*మీ పిల్లల వల్ల సమాజానికి మేలు జరగక పోయిన కీడు మాత్రం జరగదుగా!*
*అంతే కాదు మీరు మీ పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ అనే పేరుతో గాలికి వదిలెయ్యకుండా వారిని తరచుగా తెలిసి తెలియనట్లుగా గమనిస్తూ ఉంటే మీ పిల్లల చెడిపోతారా?*
*మీకు సమాజానికి చెడ్డ పేరు తెస్తారా? మీరే ఆలోచించండి?* *ఎందుకంటే మీ సమాజంలో మీ పిల్లల గుర్తింపుకు కారణం మీరే మీ పేరు లేకుండా మీ పిల్లలకు గుర్తింపు ఉండదు.* *కాబట్టి తల్లితండ్రులందరు పిల్లలమీద పూర్తి భాద్యత వహించాలని మీ కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*
*నేటి యువతే దేశానికి వెన్నెముక యువత పెడదారి పట్టకుండా తల్లితండ్రులారా యువతను కాపాడుకోండి*
బి.మల్లికార్జున దీక్షిత్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్ 9133320425
37
previous post