Home అంతర్జాతీయం పార్టీలు, రాష్ట్రం, అభ్యర్థుల వారీగా బెట్టింగ్‌లు

పార్టీలు, రాష్ట్రం, అభ్యర్థుల వారీగా బెట్టింగ్‌లు

ఎన్నికల పందేలు యాప్‌లలో..

0 comment

ఫెయిర్‌ప్లే, జన్నత్‌బుక్, ఓం247, జైబుక్, సాట్‌స్పోర్ట్‌247, బకార్డీ777

– రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందేం

– డిజిటల్‌ లావాదేవీల కోసం మ్యూల్‌ బ్యాంక్‌ అకౌంట్లు

– ఆయా యాప్‌ల నిర్వహణ మొత్తం విదేశాల నుంచే

– అక్రమంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సంస్థలు

– యాప్‌లు డౌన్‌లోడ్‌ చేస్తే మాల్‌వేర్‌తో ఫోన్‌ హ్యాక్‌

హైదరాబాద్ :

బంతి బంతికీ.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ ఎలాగైతే క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతున్నాయో.. అచ్చం అదే తరహాలో దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా పందేలు కాస్తున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ, సాకర్, బాక్సింగ్, హార్స్‌ రైండింగ్‌ వంటి అన్ని రకాల క్రీడలపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న పలు ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. పార్టీల వారీగా ప్రదర్శనలు, నియోజకవర్గం, అభ్యర్థుల విజయాలు, మెజారిటీ వారీగా పందేలు కడుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మన దేశంలోనే జరుగుతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా బెట్టింగ్‌లు జరిగినా అది తక్కువ స్థాయిలోనే జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో పందేలపై ఆసక్తి పెరిగింది. దీంతో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ సంస్థలు వీటిపై దృష్టిసారించాయి. ఫెయిర్‌ప్లే, జన్నత్‌బుక్‌247.కామ్‌, ఓం247.కామ్‌, జైబుక్‌.కామ్‌, సాట్‌స్పోర్ట్‌247.నెట్‌, బకార్డీ777.కామ్‌ వంటి సుమారు డజన్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు ప్రత్యేకంగా ఎన్నికల్లో బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నాయి. ఆయా యాప్‌లలో మొబైల్‌ నంబరును నమోదు చేస్తే వాట్సాప్‌కు ఓటీపీ వస్తుంది. దీని ఉపయోగించి ఐడీని క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత బెట్టింగ్‌కు అవకాశం కలుగుతుంది.

రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందెం..

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పేరొందిన ఫెయిర్‌ప్లే.. ఎంజాయ్‌ బెట్టింగ్, మీ ఆదాయాన్ని 15 శాతం పెంచుకోండి. మీ స్నేహితులకు రిఫర్‌ చేసి బోనస్‌ను సైతం అందుకోండి అంటూ ప్రచారం చేస్తుంది. రూ.100 నుంచి రూ.10 లక్షల వరకు పందేం వేయవచ్చు. టెలిగ్రాం, వాట్సాప్‌ వంటి ఇన్‌స్టంట్‌ మెసేజ్‌ యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాదితో పాటు పలు కీలకమైన రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు తమ ముద్ర వేయాలని శ్రమిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీల గెలుపోటముల బెట్టింగ్‌లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఫ్యాన్సీ పందేలుగా పేర్కొంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి? రాష్ట్రాల వారీగా ఆయా పార్టీలు కూటమితో కలిసి ఎన్ని సీట్లు సాధిస్తాయి.. ఇలా విభాగాల వారీగా పందేలు నిర్వహిస్తున్నాయి.

మ్యూల్‌ ఖాతాల్లోనే లావాదేవీలు..

బెట్టింగ్‌ యాప్‌లు ఇండియా వెలుపలి నుంచి నిర్వహిస్తుంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యాప్‌లను నిర్వహణ చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ఈ ఎన్నికల పందేలను నిర్వహిస్తుంటారని, యూపీఐ చెల్లింపులు, బ్యాంక్‌ లావాదేవీల కోసం మ్యూల్‌ బ్యాంక్‌ అకౌంట్లనే వినియోగిస్తుంటారని తెలిపారు. పందేం డబ్బు మొత్తం ఆయా అకౌంట్ల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా ఎలాంటి పన్ను చెల్లింపులు లేకుండా దేశం దాటేస్తుంటాయని పేర్కొన్నారు.

అప్రమత్తత అవసరం..

తెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్దం. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000, ఇన్మర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌–2021 ప్రకారం ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ అనేది జూదంగా పరిగణిస్తారు. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ఏపీకే ఫైల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. డోన్‌లోడ్‌ చేసుకునే క్రమంలో ఫోన్‌ కాంటాక్ట్‌లు, ఇతరత్రా పర్మిషన్స్‌ను అనుమతించాలని కోరతారు. పొరపాటున యాక్సెస్‌ చేయగానే హానికర సాఫ్ట్‌వేర్‌లు మొబైల్‌లో డౌన్‌లోడ్‌ అయిపోతాయి. దీంతో మన ఫోన్‌ హ్యాక్‌ అయిపోతుంది. సైబర్‌ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యాప్‌లు ఏంటంటే..

– ది ఫెయిర్‌ప్లే.ఐఓ

– జన్నత్‌బుక్‌247.కామ్‌

– ఓం247.కామ్‌

– జైబుక్‌.కామ్‌

– సాట్‌స్పోర్ట్‌247.నెట్‌

– బకార్డీ777.కామ్‌

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4