హైదరాబాద్ : నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్పకి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని సీనియర్ సర్జన్‌గా పలు విభాగాల్లో సేవలు అందిస్తున్నందుకు గాను రాయ్ కాలేజ్ ఆఫ్ ఫిజిషిన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో ఎఫ్‌ఆర్‌సీఎస్ తో గౌరవించింది. ఆ కళాశాల 486 ఏళ్ల చరిత్రలో ప్రభుత్వ రంగ ఆస్పత్రి సర్జన్‌కి కేటాయించడం ఇదే ప్రథమం.
డైరెక్టర్ బీరప్ప వైద్య వృత్తిలో అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు ఆస్పత్రిలో పేద రోగులకు నాణ్యమైన సేవలు, వేగంగా అందించేలా చొరవ తీసుకున్నారు. ఓ సర్జన్‌గా వేల శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన అందిస్తున్న సేవల్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌సీఎస్ కేటాయించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో నెలలో గ్లాస్గోలో నిర్వహించే సదస్సులో ఆయనకి ఈ ఎఫ్‌ఆర్‌సీఎస్ ని ప్రధానం చేయనున్నారు. కాగా రెండేళ్ల క్రితం రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎఫ్‌ఆర్‌సీఎస్ అందుకున్నారు. మూడేళ్ల క్రితం
అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఎఫ్ఏసీఎస్ ప్రధానం చేశారు.