32
యోగా ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం..
“యోగేన చిత్తస్య పదేనా వాచం
మలం శరీరస్య చవైద్యకేనా యోపాకరోత్తం ప్రవరం మునినాం
పతంజలిం ప్రాంజలి రానాతోష్మి”
మానసిక కల్మషములను యోగము ద్వారాను, వాగ్దోషములను వ్యాకరణము ద్వారాను, శారీరక రుగ్మతలను ఆయుర్వేదం ద్వారాను తొలగించిన ముని శ్రేష్టుడు పతంజలికి ముఖళిత హస్తములతో నా నమస్కృతులు నందజేయుచున్నాను.
యోగం అనేది ఒక పూర్ణ విజ్ఞానం, యోగ అంటే ఒక పూర్ణ చికిత్స పద్ధతి, ఒక పూర్ణ జీవనశైలి, ఒక పూర్ణ ఆధ్యాత్మిక విద్య అయి వున్నది. యోగ రహస్యం ఇది. లింగం, జాతి, వర్గం, భాష, సంప్రదాయం, క్షేత్రం, మరియు భాషభేదముల యొక్క సంకిర్ణత్వంతో బందిచబడలేదు. సాధకులు, యోగులు, మునులు, ఋషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు, అందరూ దీనిని సాధన చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.