35
ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు
ముంబై :
దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.