28
భారత్ , అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టి20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మూడు టి 20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలి వేదికగా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబె 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు.