26
హైదరాబాద్ (NEWS): తెలంగాణ జెన్‌కొఎఇ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా పడింది. ఎన్నికలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పెరేషన్ లిమిటెడ్ (జెన్‌కొ) లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎఇ)
కెమిస్ట్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్ష వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీన ప్రకటిస్తామని జెన్‌కొ తెలిపింది. మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేయనున్నారు.