25
తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. నా కూతురుకు పెళ్లి అయ్యింది. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీ. నన్ను నా కూతురు తో కొంతమందితో తిట్టించారు.
ఇది బాధాకరం. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీ లో చేరాను.. ఇక పక్క చూపులు చూడను.ఎవరెన్ని అనుకున్న సీఎం జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయం. నేను పదవుల కోసం పాకులాడను. పదవులు కూడా అడగను. నేను సేవకున్ని.