37
హైదరాబాద్ : మే 4 వ తేదీన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఎల్ బీ స్టేడియం లో ఘనంగా నిర్వహించతలబెట్టిన “డైరెక్టర్స్ డే” సెలెబ్రేషన్స్ కొత్తగా షెడ్యూల్ అయిన ప్రముఖ నాయకుల కార్యక్రమాల కారణంగా పోలీస్ లా అండ్ ఆర్డర్ వారు పర్మిషన్ ని రద్దు చేయడం జరిగింది .
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మే 4 న డైరెక్టర్స్ డే గా గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే . మరో రెండు రోజులలో ఈ కార్యక్రమం మరలా ఏ తేదీన నిర్వహించేది తెలియచేస్తామని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్, జనరల్ సెక్రటరీ సి హెచ్ సుబ్బారెడ్డి తెలియజేసారు.