గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !.. కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది !
గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు!
అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!. మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! . ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి !. పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది !. మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ?. ఎక్కువలో ఎక్కువ 5000 / ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ?
రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ?. అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !.
పూజారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి