28
తెలంగాణలో ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం నుంచి పండిన వరికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు. గత అక్టోబర్ లోనే మేడిగడ్డ కుంగిందని, గత ప్రభుత్వం అందులోని నీళ్లు వదిలిపెట్టిందన్నారు. వర్షాకాలంలోనూ బ్యారేజీల్లోని నీటిని దిగువకు వదలాలన్న డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.