విజయవాడ :క్షత్రియ సమాజం గురించి నాకంటే మీకు బాగాతెలుసు. ఒక్క విషయాన్ని మీముందు ఉంచటానికి సాహసం చేస్తున్నాను. 1951 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో క్షత్రియులు 2 శాతం ఉండేవారు. సత్యం రామలింగరాజు మాతో సర్వే చేయించినప్పుడు క్షత్రియులు 4 లక్షలు, ఇంకను సర్వేలో రానివారు 2 లక్షలు లేదా అత్యధికంగా 4 లక్షలు అనగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 6 నుంచి 8 లక్షలుంటారు. అంటే రాష్ట్ర జనాభాలో క్షత్రియులు 0.89 శాతం మాత్రమే పూర్వం 2 శాతం అయితే ఇప్పుడు 0.89 శాతంకి పడిపోయింది. వచ్చే 25-30 సం॥రాలు ఇంకా వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబం లోను ప్రస్తుత యువతరంలో ఒక అబ్బాయి లేదా అమ్మాయితో సరిపెట్టేవారు నూటికి 50 మంది ఉంటున్నారు. ఈ ఆలోచన ఇంకా ఊపందు కుంటుంది. ఈ ఆలోచనా విధానం ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దానికి రాజులు ఎంతమంది మిగులుతారో ఆలోచించండి. దీనిలో 5 శాతం ప్రేమ పెళ్ళిల్లు, ఇంకో 5 శాతం ఇతర దేశాలకు వలస రూపంలోను వెళతారు. రానురాను ఈ శాతం పెరుగుతుంది. ఇది కాలక్రమంలో వచ్చే మార్పులలో జరిగేదే అయినా ఈ విధంగా క్షత్రియ సమాజం సన్నగిల్లితే మనం ఎవరికి సేవచేయాలి. ఇంతటి ఉన్నత భావాలు గల సమాజం ఇలా అంతరించి పోవటం న్యాయమా ?
మానవుడు ఒకనోరు రెండు చేతులతో పుడతాడు. రెండు చేతులు కష్టపడితే ఒకనోరుకు ఆహారం అందించలేమా. క్షత్రియుడికి కావలసింది మనోధైర్యం అదిలోపించి ఏకసంతానానికి వెళుతున్నారు ఇది సరికాదు. చివరిరోజుల్లో ఏకసంతానం వల్ల ఎంతోమనోవ్యధకి గురైన వారిని మనం చూస్తున్నాము. కనీసం ఇద్దరికి జన్మనివ్వండి. మీరిద్దరు మీకు ఇద్దరు సమతూకాన్ని పాటించండి. ఇంకా అభివృద్ధి పరిస్తే మరీ మంచింది. కనీసం ముగ్గురు సంతానం ఉంటే ప్రస్తుత సంఖ్య నిలబడుతుంది. ప్రపంచ దేశాలు ఫ్రాన్స్, రష్యా ఇతర ఐరోపా దేశాలలో ప్రజా సంఖ్య తగ్గుతుంటే ఇప్పుడు ఎక్కువ సంతానవంతులకు పారితోషికం ఇస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించి దేశశ్రేయస్సు కొరకు నూటికి మారుశాతం కుటుంబ నియంత్రణ పాటిస్తున్న జాతి ఏదైనా ఉంటే అది మనమే. అందువల్ల ఎంతో నష్టపోతున్నాము. ఎందుకంటే నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో సంఖ్యాబలానికే ప్రాముఖ్యత ఎక్కువ అవడంతో మనం రాజకీయంగానూ, సామాజికంగాను ఎంతో నష్టపోతున్నాము. ఇది కొనసాగితే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలను ముందుండి నడిపిన ఒక జాతిపూర్తిగా అంతరించిపోయే ప్రమాదం పొంచియుంది. మానవ తప్పిదం వల్ల ఒక జాతి అంతరించి పోవటం సరికాదు.
దయచేసి సమాజ సభ్యులారా మేల్కొండి.
— వేగేశ్న మల్లపరాజు, రి.లెక్చరర్, భీమవరం