తాడేపల్లి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..
ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రజలను ల్యాండ్ టైటిలింగ్ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారు. పచ్చమీడియా సహకారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విషప్రచారం చేస్తున్నారు.
– వ్యవస్థల మీద నమ్మకం పోయేలాగ వారు వ్యవహరిస్తున్నారు.
– వైయస్సార్ సిపినేతలు భూములు మింగేస్తారని దారుణంగా మాట్లాడుతున్నారు.
– సిఎం వైయస్ జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగ్…. గ్రాభింగ్ కాదు. కొద్దిరోజులుగా ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలో ఉంది. 17వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలో సమగ్ర భూసర్వే జరిగింది. ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చు. ప్రజలనుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాతనే ఈ చట్టం రూపుదిద్దుకుంటుంది.అలాంటప్పుడు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం.అధికారకాంక్షతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ధ్యేయం. కబ్జాలకు,అక్రమాలకు,అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంధని చంద్రబాబు భయం. 14 యేళ్లు సీఎం గా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. రాష్ర్టంలో భూ రీసర్వే పూర్తిగా జరిగిన అనంతరం మాత్రమే విధివిధానాలు ఖరారవుతాయి. ఎన్నికలలో ఓట్ల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు.ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీనే.టీడీపీ ప్రభుత్వహయాంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలు బయటపడ్డాయి. తెల్గి స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులు ఉన్నాయి..గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా..? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులు.. వైయస్ జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చింది.. ఈయనకి నచ్చకపోతే ఇబ్బంది ఏమీ లేదు.
-ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అని ఉంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. బిజేపి నేతలు చంద్రబాబుకు ఈ విషయంలో మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలి. వ్యవస్థ పై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరం..నరేంద్ర మోడీ తీసుకువచ్చిన యాక్ట్ ఇది.. రాగానే రద్దు అని చంద్రబాబు అంటున్నాడు దీనిపై బిజెపి ఏమి సమాధానం చెప్తుంది..? నరేంద్ర మోడీ కూడా దేశంలో ల్యాండ్ కబ్జా చేస్తున్నాడా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు. అందుకే ఈ యాక్ట్ ను రద్దు చేస్తాను అంటున్నాడు అంటే చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడు అని అర్థం. సీఆర్ డి ఏ లో చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు సైతం దోచేశారు.అమరావతిలో చంద్రబాబు చేసిన ల్యాండ్ స్కాం పై విచారణ జరుగుతుంది. డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో లాక్కున్నారు. 2014-19 మధ్యనే ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. సాదాబైనామా పేరుతో పేపర్ క్రియేట్ చేసి భూములు కాజేశారు. ఈ యాక్ట్ తో చంద్రబాబు అరాచకాలు బయటపడతాయి.. అందుకే బయం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పగడ్బంధిగా ప్రజలకు మేలు చేసేదిలాగా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదు..చంద్రబాబు ఆరోపణల పై సీఐడీ విచారణకు ఈసి ఆదేశాలు ఇవ్వడం మంచిదే. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాము. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి చంద్రబాబు చేస్తోంది ఏంటనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం.