32
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ
ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన ఈసీ.
ఈసీ నిషేదంపై స్పందించిన కేసీఆర్
నా మీద ఈసీ 48 గంటలు ప్రచారంలో పాల్గొనకూడదని నిషేదం విధించింది.. ఇదే రేవంత్ రెడ్డి నా మీద పేగులు మెడలేసుకుంటా, గుడ్లు పీకుతా అంటే రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేదం పెట్టలేదు. నేను అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపిస్తున్నా.. నా మీద 48 గంటలు నిషేదం విధిస్తే, మీరు 96 గంటలు ప్రచారం చేయండి.