హైదరాబాద్ :మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదుఈ నెల1వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉంది. ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది ఇది ఎలక్షన్ రూల్స్ పాటించలేదని ఫిర్యాదు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని… చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్.
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడే సమయంలో కొంత మంది మైనర్ బాలికలు వేదిక పైకి తీసుకొని అమిత్ షా చిన్నారులకు తన వద్దకు రమ్మంటు సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఫిర్యాదు పై స్పందించిన EC జరిగిన సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఆదేశించారు. హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ
మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024 . సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు.
A1)యమాన్ సింగ్,
A2)హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత,
A3) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
A4) రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి
A5)MLA రాజసింగ్ పై కేసు నమోదు