కోటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రతతో మండే సూర్యుడు..
మన సూర్యుడు సహా ఏదైనా నక్షత్రం నిరంతరం భగభగ మండుతుందన్న విషయం మనకు తెలిసిందే. అందులో కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని కూడా మనం చదువుకున్నాం. మరి దాదాపు అదే స్థాయిలో ఉష్ణాన్ని మనిషి కృత్రిమంగా తయారు చేయగలిగితే? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ వివరాలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చూసేయండి మరి.
నక్షత్రాల్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను… అంటే అవి మండే తీరును కృత్రిమంగా అభివృద్ధి చేయాలని సైంటిస్టులు 70 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు.
టెక్నాలజీకి మారుపేరైన దక్షిణ కొరియా శాస్ర్తవేత్తలు ఈ దిశగా మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే 2021లో 31 సెకన్లపాటు ఈ తరహా ప్రయోగాన్ని చేసి విజయం సాధించిన వారు తాజాగా ‘కృత్రిమ సూర్యుడి’తో ల్యాబ్ లో సరికొత్త రికార్డు సృష్టించారు.
కొరియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీకి చెందిన పరిశోధకులు ఫ్యూజన్ రియాక్టర్ లో ప్లాస్మా లూప్ ను అత్యంత వేడికి గురిచేయడం ద్వారా ఏకంగా కోటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణాన్ని 48 సెకన్లపాటు మండించారు. అంటే పదార్థములోని పాజిటివ్ అయాన్లను, నెగెటివ్ చార్జ్ గల ఫ్రీ ఎలక్ట్రాన్లను డోనట్ ఆకారంలోని రియాక్టర్ చంబర్ లో అయస్కాంత క్షేత్రాల మధ్య చిక్కుకొనేలా చేస్తారు. తద్వారా రియాక్టర్ లోని టంగ్ స్టన్ తో తయారు చేసిన డైవర్టర్లను ఉపయోగించారు.