29
*పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు సహాయం చేసిన కేటీఆర్*
పద్మశ్రీ ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు మొగులయ్య కు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలి పని చేసుకుంటున్న వార్తల పట్ల స్పందించిన కేటీఆర్ ఆయనను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కేటీఆర్ మొగులయ్యను కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకి గర్వకారణమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.
కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారి జీవితం గడపడడమే కష్టం ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయం పట్ల మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు.